వైసీపీకి మరో షాక్‌... టీడీపీలో చేరిన మరో ఎమ్మెల్యే

వైసీపీకి మరో షాక్‌... టీడీపీలో చేరిన మరో ఎమ్మెల్యే

04-11-2017

వైసీపీకి మరో షాక్‌... టీడీపీలో చేరిన మరో ఎమ్మెల్యే

వైకాపా నుంచి మరో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తన అనుచురులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజేశ్వరికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని జగన్‌ తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. నా నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తానని అమె అన్నారు.