ఏపీకి జీవనాడి పోలవరం : చంద్రబాబు

ఏపీకి జీవనాడి పోలవరం : చంద్రబాబు

04-11-2017

ఏపీకి జీవనాడి పోలవరం : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన కార్తీక వనమహోత్సం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ మారాలని అన్నారు. చదువుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దని అన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. రాష్ట్రంలో కోటీ ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చి, భూమిని జలాశయంగా మార్చుకోవాలని పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణా డెల్టా పచ్చగా ఉందని తెలిపారు. కార్తీక వనభోజనాలు కులాలకే పరిమితం చేయొద్దని, అన్ని కులాలు, మతాలు కలిసి సంయుక్తంగా కార్తీక వనభోజనాలు చేయాలని పిలుపునిచ్చారు.