అమరావతిలో విదేశీ భవన్‌
MarinaSkies
Kizen
APEDB

అమరావతిలో విదేశీ భవన్‌

04-11-2017

అమరావతిలో విదేశీ భవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విదేశీ ప్రయాణ అవసరాలను తీర్చేందుకు అమరావతిలో విదేశీ భవన్‌ నిర్మించడానికి కేంద్ర విదేశాంగశాఖ సిద్ధంగా ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఈ విషయం తెలిపారు. పాస్‌పోర్టు, ఇమ్మిగ్రేషన్‌, ఇతర దరఖాస్తుల పరిశీలన కోసం సమీకృత విదేశీ భవన్‌ను అమరావతిలో నిర్మించాలన్న తన ప్రతిపాదనకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ అంగీకరించారని, భూమి ఇస్తే పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనికి చంద్రబాబు సుమఖత వ్యక్తం చేశారు. వెంటనే ఆ పనులు చూడాలని తన కార్యదర్శులను ఆదేశించారు.