ఉపరాష్ట్రపతి వెంకయ్య ఏపీలో పర్యటన
Sailaja Reddy Alluddu

ఉపరాష్ట్రపతి వెంకయ్య ఏపీలో పర్యటన

01-11-2017

ఉపరాష్ట్రపతి వెంకయ్య ఏపీలో పర్యటన

భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నవంబర్‌ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నార. నవంబర్‌ 5న ప్రత్యేక విమానంలో 9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయంకు చేరుకొని 10 గంటలకు ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్టుకు చేరుకుంటారు. పది గంటల నుంచి 11 గంటల మధ్య జరిగే మెడికల్‌ క్యాంప్‌లో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. నవంబరు 6న 8:30 గంటలకు స్వర్ణ భారత్‌ ట్రస్టు నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 9:40 గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11:50 నిమిసాలకు రాజమండ్రిలో బయలుదేరి 12:20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 12:30 గంటలకు స్వర్ణ భారత్‌ ట్రస్టు చేరుకుని అక్కడే భోజనం చేస్తారు. 6 గంటలకు స్వర్ణ భారత్‌ ట్రస్టు నుంచి రోడ్డు మార్గం గుండా పిడబ్ల్యూడి గ్రౌండ్‌లో జరిగే కోటీ దీపోత్సవానికి వెళతారు. రాత్రి 7:55 గంటలకు విజయవాడలో బయలుదేరి తిరిగి గన్నవరం ఆత్కూరులోని స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.