సీఎం నివాసంలో ఏక్తా దివస్‌

సీఎం నివాసంలో ఏక్తా దివస్‌

01-11-2017

సీఎం నివాసంలో ఏక్తా దివస్‌

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏక్తా దివస్‌ను పాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంలో అందుబాటులో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్‌ పటేల్‌ దార్శనికత, ఆచరించే విధానాల వల్ల దేశ సమైక్యత సాధ్యమైందన్నారు. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతలకు ప్రతి ఒక్కరూ అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌, సీఎం అదనపు కార్యదర్శి అడుసుమిళ్లి రాజమౌళి, సమాచార శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీలు వి.వి.వి చౌదరి, టి.డి.జనార్దన్‌, పార్టీ నేతలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.