వచ్చే ఏడాది జూన్‌ నాటికి 5 లక్షల ఎన్టీఆర్‌ గృహాలు
Sailaja Reddy Alluddu

వచ్చే ఏడాది జూన్‌ నాటికి 5 లక్షల ఎన్టీఆర్‌ గృహాలు

01-11-2017

వచ్చే ఏడాది జూన్‌ నాటికి 5 లక్షల ఎన్టీఆర్‌ గృహాలు

వచ్చే ఏడాది జూన్‌ నాటికి 5 లక్షల ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణాలను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వచ్చే జనవరికి 2.5 లక్షలు, జూన్‌ నాటికి 2.5 లక్షలు కలిపి మొత్తం 5 లక్షల ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలు పూర్తికావాలన్నారు. ఎక్కడెక్కడ ఇళ్లులేని వారున్నారో గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనవరి 2019 నిర్దేశిత లక్ష్యల ప్రకారం అన్ని గృహాల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణం, సీమే తదితర పథకాల ప్రగతిని చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎంతమందికి ఇళ్లులేవో సమగ్ర సర్వే చేయాలని, ఇళ్లు లేని వారందరికీ గృహాలు మంజూరు చేస్తామని, ఇందుకు ప్రణాళిక యోచిస్తున్నామని స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి సృష్టం చేశారు. ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణం కింద దశలవారీగా నిర్మించే 13 లక్షల గృహాలకు జియోట్యాంగింగ్‌ చేయాలని, ఆన్‌లైన్‌లో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు.