ఏపీ అభివృద్ధికి ఏఐఐబి పెట్టుబడులు

ఏపీ అభివృద్ధికి ఏఐఐబి పెట్టుబడులు

01-11-2017

ఏపీ అభివృద్ధికి ఏఐఐబి పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 5 ప్రాజెక్టులకు రూ.13 వేల కోట్లు (2 బిలియన్‌ డాలర్లు) రుణం అందించడానికి ఆసియన్‌ ఇన్‌ఫ్రా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఎఐఐబి) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉపాధ్యక్షులు, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధికారి డిజె పాండియన్‌ నేతృత్వంలో ఆ బ్యాంకు ప్రతినిధులు చంద్రబాబుతో సమావేశమై ఈ విషయంపై చర్చించారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి 2 ప్రాజెక్టులు, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం, మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్‌శాఖలకు సంబంధించి ఒక్కొక్క ప్రాజెక్టు వంతున మొత్తం 5 ప్రాజెక్టులకు సహాయం అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. కేంద్రం ఆ ప్రతిపాదనలను ఎఐఐబికి పంపగా, బ్యాంకు ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఎస్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వారికి వివరించారు. దీంతో, ఏపీ అభివృద్ధికి ఎఐఐబి పూర్తిస్థాయిలో సహకరిస్తుందని పాండియన్‌ హామీ ఇచ్చారు.