రాజధాని రైతులకు ఘన స్వాగతం
Sailaja Reddy Alluddu

రాజధాని రైతులకు ఘన స్వాగతం

31-10-2017

రాజధాని రైతులకు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నుంచి సింగపూర్‌ చేరుకున్న అమరావతి రైతులకు అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. సింగపూర్‌ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో రైతులకు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కల్పి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో సింగపూర్‌ తెలుగుదేశం ఫోరం అధ్యక్షుడు జయరామ్‌, ఉపాధ్యక్షుడు చెన్నుపాటి భానుచంద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నాగ్‌ నంబూరి, కార్యదర్శి సతీష్‌ పారేపల్లి, పీఆర్వో వెంకట్‌ గోనుగుట తదితరులున్నారు. కాగా మొదటి విడతలో 34 మంది రైతులు నాలుగు రోజులపాటు సింగపూర్‌లో పర్యటిస్తారు. 40 ఏళ్లలో సింగపూర్‌ అభివృద్ధి ఎలా సాధించిందనే అంశంపై అధ్యయనం చేసి అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించుకుంటారు. అభివృద్ధి దశలో అక్కడి ప్రజలకు ఎలాంటి అవకాశాలు వచ్చాయి? వాటిని ఎలా వినియోగించుకుని అభివృద్ధి చెందారనే అంశాలను ఈ పర్యటనలో రైతులు పరిశీలిస్తారు.