ఏపీలోనే సోనీ ఫోన్ల తయారీ

ఏపీలోనే సోనీ ఫోన్ల తయారీ

31-10-2017

ఏపీలోనే సోనీ ఫోన్ల తయారీ

సోనీ కంపెనీ ఫోన్లు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తయారుకానున్నాయి. సోనీ కంపెనీకి చెందిన ఎక్స్‌పీరియా ఆర్‌ 1, ఎక్స్‌పీరియా ఆర్‌ 1ప్లస్‌ ఫోన్లను శ్రీసిటీలో తయారుచేయనున్నారు. సోనీ కంపెనీ తన ఫోన్లను తయారుచేసే కాంట్రాక్టును ఫాక్స్‌కాన్‌ కంపెనీకి ఇచ్చింది. ఈ పాక్స్‌కాన్‌ తన శ్రీసిటీలో యూనిట్‌లో వీటిని తయారు చేయనుంది. ఇది మేకిన్‌ ఏపీకి పెద్ద బూస్ట్‌ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. విశాఖపట్నంలో నవంబరు 15 నుంచి 17 వరకు జరగనున్న ఆగ్రిటెక్‌ సదస్సుపై లోకేష్‌ చర్చించారు. ఐటీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. సాగును సుస్థిర చేసేందుకు, రైతును లాభాల బాట పట్టించే మార్గాల మీద టెక్‌ స్టార్టప్‌లు దృష్టి పెట్టాలని లోకేష్‌ పేర్కొన్నారు.