తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా అవినాష్‌?

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా అవినాష్‌?

31-10-2017

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా అవినాష్‌?

దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్‌కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అనుబంధ సంఘాల నియామకంపై తెలుగుదేశం అధిష్ఠానం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. ఈ సంఘాల్లో యువత అధ్యక్ష పదవికి పార్టీ వర్గాల్లో ఆకర్షణ ఉంది. వివిధ కారణాలతో గత రెండేళ్లుగా ఈ పదవి భర్తీ చేయలేదు. ఎన్నికల ముందు అనుబంధ సంఘాలను క్రియాశీలం చేసే లక్ష్యంతో వాటికి కార్యవర్గాలను నియమించాలని తలపెట్టారు. ఇందులో భాగంగా అవినాస్‌ పేరు తెరపైకి వచ్చింది. చురుగ్గ ఉండటం, యువతను సమీకరించి విజయవాడ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఆయన వైపు మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు. అంతకు ముందు శ్రీకాకుళం ఎపీ రామ్మోహన్‌నాయుడు, మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌ పేర్లు వినిపించాయి. రామ్మోహన్‌ ఎంపీ బాధ్యతల వల్ల సమయం కేటాయించే పరిస్థితి లేకపోవడం, ఉన్నత చదువుల కోసం విజయ్‌ అమెరికా వెళ్లడంతో వారిద్దరి పేర్లు పక్కకు వెళ్లాయి. అవినాస్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పార్టీలో తనకు ఏదైనా బాధ్యత ఇవ్వాలని, ఏది ఇచ్చినా పనిచేస్తానని విజ్ఞప్తి చేయగా, పరిశీలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.