అగ్రిటెక్‌ స్టార్ట్‌ అప్‌ కంపెనీలకు పూర్తి సహకారం

అగ్రిటెక్‌ స్టార్ట్‌ అప్‌ కంపెనీలకు పూర్తి సహకారం

28-10-2017

అగ్రిటెక్‌ స్టార్ట్‌ అప్‌ కంపెనీలకు పూర్తి సహకారం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో వ్యవసాయాన్ని లాభసాటిగాను, స్ధిరమైన అభివృద్ధి సాధించే దిశగా అనేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ముంబై రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పుడ్‌ అండ్‌ అగ్రి ఇన్వెస్టెమెంట్‌ సమ్మిట్‌ 2017 కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు క్రెడిట్‌ రేటింగ్‌ ఇచ్చే నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర భూమి వివరాలు, రైతు ఏ పంట వేశారో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగిస్తున్నామని తెలిపారు. దీనిని ఉపయోగించి ఫింటెక్‌ టెక్నాలజీ ద్వారా రైతులు బ్యాంకులు సులభంగానూ, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే మోడల్‌ సిద్ధం చేస్తున్నామని వివరించారు. టెక్నాలజీ సెన్సార్ల సహాయంతో పత్తి పంట వేస్తే నష్టాలు వస్తాయని అని ముందే గుర్తించామని తెలిపారు.