సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

28-10-2017

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

తొమ్మిది రోజుల విదేశీ పర్యటన పూర్తిచేసుకొని రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే వంశీ తదితరులు ఘన స్వాగతం పలికారు. రెండేళ్లుగా పోలవరం నీటినందించి పంటలను కాపాడినందుకు కాకులపాడు సహకార సంఘం మాజీ అధ్యక్షులు చలసాని పూర్ణబ్రహ్మయ్య ముఖ్యమంత్రిని సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉండవల్లికి బయలుదేరి వెళ్లారు.