పర్యాటక పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం
Sailaja Reddy Alluddu

పర్యాటక పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం

28-10-2017

పర్యాటక పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం

పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమని, పెట్టుబడులతో వచ్చే ఔత్సాహికులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియా అన్నారు. పర్యాటక శాఖ, ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంయుక్త ఆధ్వర్యాన విశాఖలో జరిగిన రీజనల్‌ టూరిజం ఇన్వెస్టర్స్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న అంశాలు, నిబంధనలను సరళీకృతం చేయడంతో పాటు, సాంకేతికతను పెంచుతూ రాష్ట్రాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్ర ఆదాయన్ని పెంచడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు.

పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడుల వల్ల ఉపాధి అవకాశాలు మెరుగువుతాయన్నారు. పర్యాటక శాఖ, పెట్టుబడి దారుల మధ్య అంతరాన్ని తగ్గించడం, వారికి మెరుగైన సేవలందించేలా పరిస్థితులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సువిశాల తీర ప్రాంతం కలిగిన నవ్యాంధ్రలో తీరప్రాంత పర్యాటకం పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవకాశాలున్నాయన్నారు. కేంద్ర స్థాయిలో పర్యాటక ప్రాజెక్టులకు సత్వరమే అనుమతులు లభించేలా చూసేందుకు ఢిల్లీలో ఒక అధికారిని నియమించామని తెలపారు. ఇప్పటి వరకూ జరిగిన ఒప్పందలకు అనుమతులు తెచ్చి వాటిని ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.