వైభవంగా పున్నమి గరుడ వాహన సేవ
APEDB

వైభవంగా పున్నమి గరుడ వాహన సేవ

06-10-2017

వైభవంగా పున్నమి గరుడ వాహన సేవ

పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మూెత్సవం సందర్భంలో రద్దీ కారణంగా గరుడ సేవలో మలయప్పను దర్శించుకోలేని భక్తుల కోసం పౌర్ణమి సందర్భంగా పున్నమి గరుడ వాహన సేన నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా సాయం సంధ్యాసమయంలో సహస్రదీపాలంకార సేవ ముగించుకున్న ఉత్సవమూర్తులు వాహన మండపంలో వేంచేపు చేశారు. వజ్ర వైడ్యూర్య, మరకత మాణిక్యాదులు, స్వర్ణాభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలంకరణతో స్వామివారు భక్తకోటికి దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన వాహన సేవ వేలాది మంది భక్తుల హారతుల మధ్య గంటకుపైగా సాగింది.