రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి : చంద్రబాబు
MarinaSkies
Kizen

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి : చంద్రబాబు

05-10-2017

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి : చంద్రబాబు

రాష్ట్ర పండువగా వాల్మీకి జయంతి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా వాల్మీకుల కష్టాలు స్వయంగా చూశానని అన్నారు. వాల్మీకులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చుతామని అన్నారు. అధ్యయనానికి కారెం శివాజీ నేతృత్వంలో కమిటీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వాల్మీకి ఫెడరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి రూ.25 కోట్లు, ప్రభుత్వం ద్వారా రూ.25 కోట్ల రుణాలు ఇస్తామని చెప్పారు.