మారకపోతే... మారిపోతారు
MarinaSkies
Kizen

మారకపోతే... మారిపోతారు

05-10-2017

మారకపోతే... మారిపోతారు

ఇంటింటికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తీరుతెన్నులపై ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా నేతలతో చర్చించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించిన తీరుతెన్నులపై ఈ సందర్భంగా ఆయన చర్చించారు. ఈ కార్యక్రమం సక్రమంగా జరగని నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని చూస్తానంటూ పార్టీ అధినేత నేతలను హెచ్చరించారు. పలు నియోజకవర్గాల్లో సక్రమంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అమలు కాకపోవడం ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తమ పనితీరు మెరుగుపరుచుకోకపోతే రాజకీయ భవిష్యత్తు వుండదని,  ఇకనైనా మీరు మారకపోతే ఇన్‌చార్జిలుగా మీరు మారిపోతారంటూ నేతలను గట్టిగా హెచ్చరించారు. 

ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతున్న తీరుపై ఆయన గ్రేడింగ్‌ ఇచ్చారు. దాదాపు 20 నియోజకవర్గాలు సి,డి గ్రేడింగ్‌లో వుండడం పట్ల ఆయా నియోజకవర్గాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సి, డి గ్రేడింగ్‌ వచ్చిన నియోజకవర్గ ఇన్‌చార్జులు తమ పనితీరు మెరుగుపర్చుకోకపోతే అక్కడ కొత్త ముఖాలను చూస్తారంటూ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాలకు బి గ్రేడ్‌ రావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైన నేతలను పని తీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.