అమరావతిలో నిర్మాణాలపై సినీ దర్శకులతో సీఎం చంద్రబాబు భేటీలు
MarinaSkies
Kizen

అమరావతిలో నిర్మాణాలపై సినీ దర్శకులతో సీఎం చంద్రబాబు భేటీలు

04-10-2017

అమరావతిలో నిర్మాణాలపై సినీ దర్శకులతో సీఎం చంద్రబాబు భేటీలు

తాజాగా ప్రజంటేషన్‌ సమర్పించిన దర్శకుడు బోయపాటి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం సినీ దర్శకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరుసగా సమావేశమవుతున్నారు. రాజధానిలో నిర్మాణాల కోసం ఇంతకుముందు దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో భేటీ అయిన సీఎం చంద్రబాబు తాజాగా మరో సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సమావేశమయ్యారు. రాజధానిలోని పవిత్ర సంగమం దగ్గర వెంకటేశ్వరుని ఆకృతి ఆలయ శిఖర నిర్మాణానికి సంబంధించిన ప్రజంటేషన్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను బుధవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. తిరుమలేశుని మూడు నామాలు, ఆలయ గోపురం కింద నుంచి గోదావరి నదీ ప్రవాహం సాగేలా నిర్మాణం ఈ నిర్మాణం ఉండనుంది. దశావతారాల థీమ్‌తో ఆలయ శిఖర ఆకృతికి దర్శకుడు బోయపాటి శ్రీను రూపకల్పన చేశారు. ఈ మేరకు ప్రజంటేషన్‌ను సీఆర్‌డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బోయపాటి అందజేశారు.