ఉపగ్రహాల ద్వారా మనదేశం ఎంతో అభివృద్ధి : ఉపరాష్ట్రపతి
MarinaSkies
Kizen

ఉపగ్రహాల ద్వారా మనదేశం ఎంతో అభివృద్ధి : ఉపరాష్ట్రపతి

04-10-2017

ఉపగ్రహాల ద్వారా మనదేశం ఎంతో అభివృద్ధి : ఉపరాష్ట్రపతి

ఉపగ్రహాల ద్వారా మనదేశం ఎంతో అభివృద్ధి సాధించిందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంలో ఉపరాష్ట్రపతి పర్యటించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌ కురూప్‌ ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వార్షికోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అంతరిక్ష సేవలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే అంతరిక్ష ప్రయోగాల్లో మనమే ముందున్నామని అన్నారు. శ్రీహరికోట నుంచి విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనత మనదని అన్నారు.  దేశంలోని యువత వారసత్వ సంపదపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలని కోరారు. తాను వీధిబడిలో చదివి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగానని అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్‌ మోజులో పడి అందరూ మాతృభాషను మరచిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీహరికోట నుంచి ఇస్రో అతితక్కువ ఖర్చుతో మామ్‌ను నింగిలోకి పంపి విజయవంతం చేసిందన్నారు. చంద్రయాన్‌-1 ప్రయోగం ద్వారా చందమామపై నీళ్లు ఉన్నాయని గుర్తించామన్నారు.