ఉద్యోగం రావాలంటే తెలుగు రావాలి : ఉపరాష్ట్రపతి
Telangana Tourism
Vasavi Group

ఉద్యోగం రావాలంటే తెలుగు రావాలి : ఉపరాష్ట్రపతి

03-10-2017

ఉద్యోగం రావాలంటే తెలుగు రావాలి : ఉపరాష్ట్రపతి

మాతృభాషను, జన్మభూమిని మరిచిపోయినవాడు మనిషే కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం కావాలంటే తెలుగు భాష వచ్చి ఉండాలని నిబంధన విధించాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. పరభాషా ద్వేషం ఉండకూడదని అదే సమయంలో మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. ఇంగ్లీషు నేర్చుకోకుంటే మా పిల్లలు ఏమౌతారో అన్న ఆందోళన తల్లిదండ్రులలో అవసరం లేదన్నారు. తాను వీధి బడిలో చదువుకున్నానని చెప్పిన వెంకయ్యనాయుడు, చంద్రబాబు కూడా ఇంగ్లీషు మీడియంలో చదువులోలేదనీ, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని, తాను దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యానని అన్నారు. ప్రధాని మోదీ కూడా ఇంగ్లీషు మీడియంలో చదువుకోలేదన్నారు.           

దేశవ్యాప్తంగా నదులు ఇంకిపోతున్నాయని, నదుల అనుసంధానం చాలా అవసరమని పేర్కొన్నారు. కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియడారు. నదులు అసుసంధానమైతే నీటి సమస్య తీరుతుందన్నారు. నదుల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. పోలవరం నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని,  ప్రాజెక్టు పూర్తయిన వెంటనే తాను సందర్శించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.


Click here for PhotoGallery