చరిత్రలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం
MarinaSkies
Kizen

చరిత్రలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం

03-10-2017

చరిత్రలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం

చరిత్రలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.96 కోట్లతో తొలిదశ జల రవాణా పనులు నిర్వహిస్తున్నామని, కొత్త 1890 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం జరగనుందన్నారు. 

ఉత్తర-దక్షిణాది రాష్ట్రాలను కలపాలంటే ఏపీ కీలకమని అన్నారు. విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి వెంకయ్యనాయుడు అండగా నిలిచారని అన్నారు. మూడు దశల్లో జాతీయ జలరవాణ మార్గం పనులు జరుగుతాయని, ముక్త్యాల-విజయవాడ మధ్య తొలి దశ, రెండో దశలో కాకినాడ-విజయవాడ మధ్య పనులు జరుగుతాయన్నారు. అలాగే మూడో దశలో విజయవాడ పుదుచ్చేరి మధ్య పనులు జరుగుతాయని, అలాగే సరుకు రవాణా, ప్రయాణికుల టెర్మినల్స్‌ నిర్మాణం జరగనుందన్నారు. నితిన్‌ గడ్కరీ ఏపని మొదలు పెట్టినా పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గరని, ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే వాణిజ్యపరగా ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.


Click here for PhotoGallery