ఏపీకి వెంకయ్య మరో వరం

ఏపీకి వెంకయ్య మరో వరం

25-07-2017

ఏపీకి వెంకయ్య మరో వరం

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తూ చివరి నిమిషంలోనూ నవ్యాంధ్రకు భారీ మేలు చేశారు. రాష్ట్రానికి మరో 2,25,245 ఇళ్లను కేటాయిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో ఆయన చివరి సంతకం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద రాష్ట్రానికి ఈ ఇళ్లు లభించాయి. వీటికోసం కేంద్రం తన వాటాగా రూ.14,140 కోట్లు రాష్ట్రానికి విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. వెంకయ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నపుడే రాష్ట్రం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.