రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : దేవినేని

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : దేవినేని

20-03-2017

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : దేవినేని

రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ కుడికాలువకు 17 మైళ్ల దూరంలోని  బుగ్గవాగు రిజర్వాయర్‌ను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలసి  ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ 2018 నాటికి గాలేరు నగరి అనుసంధానానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగుగంగ, హంద్రీనీవా ద్వారా రెండేళ్లలో కడప, కర్నూలు,  అనంతపురం జిల్లాలను కాపాడుతామని తెలిపారు. గోదావరి- పెన్నా నదుల అనుసంధానం ద్వారా పల్నాడుకు నీటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నాగార్జున సాగర్‌లో తక్కువ నీటి నిల్వలు ఉన్నా అందుకు ప్రత్యామ్నాయంగా బుగ్గవాగు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం 1.05 టీఎంసీల సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. బుగ్గవాగులో నీటినిల్వలు పెంచితే గుంటూరు, ప్రకాశం జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు. రూ.500 కోట్ల వరకు వ్యయం అయ్యే, ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని తెలిపారు.  ఇందుకు అవసరమైన నిధులు నీరు-ప్రగతి, ఇతర పథకాల ద్వారా కేటాయిస్తామన్నారు. వచ్చేనెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పనులు చేపడతామని తెలిపారు.