విశాఖలో మహానాడు?

విశాఖలో మహానాడు?

20-03-2017

విశాఖలో మహానాడు?

తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు, గత ఏడాది మహానాడు తిరుపతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గత ఏడాది గుంటూరులో జరపాలని పార్టీ వర్గాలు భావించినప్పటికీ అదిసాధ్యం కాలేదు. రాష్ట్ర పార్టీ సమావేశాలు, అసెంబ్లీ తదితర కార్యకలాపాలన్నీ విజయవాడ, గుంటురు జిల్లాల్లోనే జరుగుతున్నాయి. ఈ దృష్ట్యా  ఈ ఏడాది మహానాడును విశాఖలో జరపాలని పార్టీ వర్గాలు  భావిస్తున్నాయి. దీనివలన ఉత్తరాంధ్రలో పార్టీ శ్రేణులను బలోపేతం చేసినట్టవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల తరువాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మరోపక్క జరుగుతోంది. ఇప్పటికే గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు పూర్తయింది. త్వరలోనే మండలస్థాయి కమిటీల ఏర్పాటు పూర్తి కాబోతోంది. ఏప్రిల్‌ నెలాఖరునాటికి జిల్లాస్థాయి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. మే ఒకటి, రెండు వారాల్లో జిల్లాలో మినీ మహానాడు నిర్వహించి, అదే నెల 26, 27, 28 తేదీల్లో మహానాడు జరపనున్నారు.