ఆదర్శ రాష్ట్రంగా ఏపీ : చంద్రబాబు

ఆదర్శ రాష్ట్రంగా ఏపీ : చంద్రబాబు

18-03-2017

ఆదర్శ రాష్ట్రంగా ఏపీ : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు కానీ  కొద్దిమంది రాజకీయాల్లో అటూ ఇటూ ఉన్నారు. ఇకనైనా మారాలంటూ అని సూచించారు. అమరావతి రైతాంగం ఏవిధంగా అయితే తన మీద నమ్మకం పెట్టుకుందో, మిగత ప్రజలు కూడా నూటికి నూరుశాతం నమ్మం పెట్టుకుని సహకరించండి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపించి  మీ అందరి కష్టాలను తీర్చే బాధ్యత మేం తీసుకుంటామని తెలిపారు. 2017-18 బడ్జెట్‌లో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశామని తెలిపారు. పేదరికం, వెనుకబడిన వర్గాలే కొలమానం  అని అన్నారు. కులం, మతం లేదు అందుకే ఈ ఏడాది అభివృద్ధికి పెద్దపీట వేశామని సృష్టం చేశారు.