భారతీయులపై జరిగిన దాడుల గురించి చర్చించాలి

భారతీయులపై జరిగిన దాడుల గురించి చర్చించాలి

18-03-2017

భారతీయులపై జరిగిన దాడుల గురించి చర్చించాలి

అమెరికాలో భారతీయులపై జరిగిన దాడుల గురించి ప్రధాని వెంటనే అమెరికా అధ్యక్షుడితో చర్చించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రధాని పార్లమెంట్‌లోకి ప్రవేశించినప్పుడు బీజేపీ సభ్యులు జైశ్రీరాం అని నినదించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగుడైన ఆచార్య సాయిబాబా ఎలాంటి తప్పిదం చేయకపోయినా దేశ ద్రోహం ముద్రవేసి పదేళ్లు కారాగార శిక్ష వేసేలా చర్యలకు పురిగొల్పారని విమర్శించారు. తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులు ఉద్యమాలను అణిచివేసే దిశగా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు, అప్పులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, అసెంబ్లీలో ఒక చట్టం తీసుకువచ్చి బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.