ఉమ్మడి పోరుకు కలసిరండి

ఉమ్మడి పోరుకు కలసిరండి

18-03-2017

ఉమ్మడి పోరుకు కలసిరండి

కృష్ణా, గోదావరి నదులపై కర్ణాటక, మహారాష్ట్రలు ఆక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడిగా పోరాటం చేద్దామని  తెలుగుదేశం ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆక్రమ ప్రాజెక్టుల విషయంలో కలసి రావాలని  లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండూ ఎడారిగా మారతాయని హెచ్చరించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు సాగు, తాగునీరందించే పురుషోత్తపట్నం ప్రాజెక్టు పోలవరం ఒక భాగం. అయినా 40 టీఎంసీలు రావాలని తెలంగాణ వాదిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం వల్లే మహారాష్ట్ర, కర్ణాటలకు గోదావరిలో 35 టీఎంసీలు ఇవ్వాల్సివస్తోంది.  ఈ పరిస్థితిలో మనం మనం కొట్లాడుడుకోవడం మానుకోవాలని అని  హితవు పలికారు.