29న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

29న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

17-03-2017

29న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీహేమలంబినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని ఈ నెల 29న నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వేకువజామున 3 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ తర్వాత ఆలయ శుద్ధి చేపట్టి తోమాల సేవను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలను సమర్పిస్తారు. పంచాంగ శ్రవణం తర్వాత బంగారు వాకిలి ఎదుట ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన శ్రీవారికి  సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.