ఉగాదికి టిటిడి మొబైల్‌ యాప్‌

ఉగాదికి టిటిడి మొబైల్‌ యాప్‌

17-03-2017

ఉగాదికి టిటిడి మొబైల్‌ యాప్‌

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం ప్రపంచ నలుమూలలనుంచి నిత్యం విచ్చేస్తున్న లక్షలాదిమంది భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి, లడ్డూలు తదితర సౌకర్యాలతో పాటు ఆర్జితసేవలు గురించి తెలుసుకోవడానికి టిటిడి నూతనంగా రూపొందించిన మొబైల్‌యాప్‌కు భక్తులే తగిన పేరు సూచించాలని టిటిడి ఇవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు కోరారు. భక్తులే టిటిడికి సమాచార వారధులుగా వ్యవహరించి ఈ మొబైల్‌యాప్‌కు తగిన పేరు సూచించాలని తెలిపారు.  ఈ నూతన టిటిడి మొబైల్‌యాప్‌ ఈ నెల 29న తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినం నుంచి భక్తులకు అందుబాటులో వుంటుంది. టిసిఎస్‌ సహకారంతో రూపొందించిన ఈ యాప్‌కు సరైన పేరు సూచించాలని కోరారు. నేటి (17వ తేదీ) సాయంత్రం 5 గంటలోపు భక్తులు ఆన్‌లైన్‌ సర్వీసెస్‌అట్‌తిరుమల.కామ్‌ అనే ఈ మెయిల్‌ లేదా 9399399399 వాట్సాప్‌ నంబర్‌కు పేరు సూచించాలని కోరారు.