ఎస్వీయూకు ఆరుదైన ఘనత

ఎస్వీయూకు ఆరుదైన ఘనత

17-03-2017

ఎస్వీయూకు ఆరుదైన ఘనత

లండన్‌లోని టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ప్రకటించిన ఏషియన్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో ఎస్వీ యూనివర్సిటీకి దక్షిణ భారతదేశంలో మొదటి ర్యాంకు లభించింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి రెండో ర్యాంకు దక్కింది. దేశంలోని 33 యూనివర్సిటీలకు ఈ టైమ్స్‌ ర్యాంకులు లభించాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ విజయరాజు ఈ వివరాలు వెల్లడించారు. ఉస్మానియా వర్సిటీకి మూడు, అమృతవర్సిటీకి 4, ఆంధ్రా యూనివర్సిటీకి 5, అన్నామలై వర్సిటీకి 6, శాస్త్రవర్సిటీకి 7, ఎస్సారెమ్‌ వర్సిటీకి 8, సత్యభామ వర్సిటీకి 9, వీఐటీకి 10వ స్థానం లభించినట్లు తెలిపారు.

ఎస్వీయూకి మొదటి ర్యాంకు రావడంపై వర్సిటీ వీసీ దామోదరం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు పట్టుదలతో చదివి విశ్వవిద్యాలయాలు ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. రెక్టార్‌ భాస్కర్‌ మాట్లాడుతూ నిరంతరం వర్సిటీ అధికారులు కలసి కట్టుగా పనిచేయడం వల్ల ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఏఎన్‌యూకి అత్యుత్తమ ర్యాంకు రావటంపై యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌, రెక్టార్‌ ఆచార్య కేఆర్‌ఎస్‌ సాంబశివరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య  కె జాన్‌పాల్‌కు హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో ఉన్న విద్య, పరిశోధన, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలే ఈ ర్యాంకు సాధనకు కారణమయ్యాయని వారు పేర్కొన్నారు.