ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు ఆగదు

ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు ఆగదు

17-03-2017

ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు ఆగదు

ఎవరెన్ని కుట్రలు చేసినా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. పోలవరానికి నిధులు, ఏపీ ప్రత్యేక ప్యాకేజీ తీర్మానంపై చర్చ అనంతరం సభను సభను వాయిదా వేశారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందనానరు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తమదేనన్నారు. ఆనాడు వైఎస్‌ ప్రభుత్వం రూ.2535 కోట్లు ఖర్చుచేసిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 3,541 కోట్లు ఖర్చుచేశామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా అడ్డుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుంటే సంతోషించాల్సింది పోయి, విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకునన నిర్ణయంపై రాష్ట్ర ప్రజల తరపున ఆయన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.