ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత

16-03-2017

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత

ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పిస్తూ కేంద్రమంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రత్యేక హోదావల్ల లభించే నిధులను ఈఏపి (ఎక్స్‌ట్రనల్లీ ఏయిడెడ్‌ ప్రాజెక్టు) ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు ఆమోదం వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడో టేబుల్‌ అంశంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ అంశం చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో మంత్రివర్గం ఏకగీవ్రంగా ఆమోదించింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు ఇవ్వడంతోపాటు, పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకుంటుంది. ప్రత్యేక హోదావల్ల లభించే నిధులను ఈ- ఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతి పాదనను మంత్రివర్గం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా గతేడాది సెప్టెంబర్‌ 8న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం  తెలిసిందే. గతంలో మాదిరిగా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పించాని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎట్టకేలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది.