ఎపి మాస్టర్‌ కార్డు

ఎపి మాస్టర్‌ కార్డు

16-03-2017

ఎపి మాస్టర్‌ కార్డు

సైబర్‌ సెక్యూరిటీలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు మాస్టర్‌ కార్డు ముందుకొచ్చింది. విశాఖలో అవిష్కరణల అభివృద్ధి కేంద్రాన్ని  ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాస్టర్‌ కార్డు గ్లోబల్‌ సీఈవో అజయ్‌ బోంగా భేటీ అయ్యారు. అమెరికాలో సైబర్‌  సెక్యూరిటీ సెల్‌ ఏర్పాటులో ముఖ్య భూమిక వహించిన మాస్టర్‌ కార్డు గ్లోబల్‌ అక్కడ ఏ తరహా సాంకేతిక పద్ధతులను అమలు చేసిందో అదే పద్ధతులను రాష్ట్రంలోనూ చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది.