రూ.లక్షా 56వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌ : యనమల

రూ.లక్షా 56వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌ : యనమల

15-03-2017

రూ.లక్షా 56వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌ : యనమల

2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మంత్రిగా ఆయన బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి. సమర్థుడైన చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని ఆయన అన్నారు. విజన్‌ 2029 లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన ముందుంచుకున్న కర్తవ్యాలను ప్రతిబింబించే బడ్జెట్‌ ఇదని ఆయన చెప్పారు. చారిత్రక నగరమైన అమరావతికి దాదాపు 2000 ఏళ్ల తర్వాత శాసనాధికారం తిరిగి సంప్రాప్తించిన సందర్భంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి యనమల అన్నారు.

బడ్జెట్‌ ముఖ్యంశాలు .....

బడ్జెట్‌ మొత్తం : రూ.లక్షా 56వేల 999 కోట్లు
రెవెన్యూ వ్యయం : రూ. లక్షా 25 వేల 912 కోట్లు
క్యాపిట్‌ వ్యయం : రూ.31,087 కోట్లు
ఆర్థికలోటు రూ.23,054 కోట్లు
రెవెన్యూలోటు రూ.416 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలు 2016-17 బడ్జెట్‌ అంచనాలకు అత్యంత చేరువగా ఉన్నాయని యనమల అన్నారు. ప్రణాళికేతర పద్దు కింద సవరించిన అంచనాలు రూ.82,101 కోట్లుగా, ప్రణాళిక పద్దు కింద అవి రూ.50,663 కోట్లుగా ఉన్నాయి. ప్రణాళికేతర వ్యయానికి కోతలు పెట్టకుండా నిబద్ధతతో నిర్వహించగలిగామన్నారు. 2016-17 సంవత్సరానికి రెవెన్యూ లోటు రూ.4,597 కోట్లు కాగా, ఆర్థికలోటు రూ.19,163 కోట్లుగా ఉందన్నారు.