శ్రీహర్షకు అరుదైన అవకాశం

శ్రీహర్షకు అరుదైన అవకాశం

15-03-2017

శ్రీహర్షకు అరుదైన అవకాశం

ప్రతిభ ఉండాలేకానీ అమెరికా తలుపులు ఇప్పటికీ తెరిచే ఉన్నాయనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని విజ్ఞాన్‌ వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల డీన్‌ ఆచార్య మూర్తి చావలి పేర్కొన్నారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీ విద్యార్థిని శ్రీహర్ష అమెరికాలో మూడు నెలలు ప్రత్యేక కోర్సు చేసేందుకు ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థినుల్లో నాయకత్వ లక్షణాలు పెంపేలక్ష్యంగా మహిళల నాయకత్వ భాగస్వామ్యంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సస్‌లో శిక్షణకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ సి తంగరాజ్‌, విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య, ఉపాధ్యక్షులు లావు శ్రీకృష్ణదేవరాయులు, వర్సిటీ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ ఆర్‌ సాంబయ్య, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌ ఉషారాణి తదితరులు విద్యార్థిని శ్రీహర్షను అభినందించారు.