అమరావతి నిర్మాణంలో షెన్‌జెన్‌

అమరావతి నిర్మాణంలో షెన్‌జెన్‌

15-03-2017

అమరావతి నిర్మాణంలో షెన్‌జెన్‌

నవ్యాంధ్ర ప్రదేశ్‌ నిర్మాణంలో అంతర్జాతీయ నిర్మాణ దిగ్గజ సంస్థలతో చర్చలు జరుగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరో షెన్‌జన్‌ చైనా తరహా అభివృద్ధి వ్యూహాలను రూపొందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన చైనా అకాడమీ ఆఫ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ షెన్‌జన్‌ కలిసింది. ప్రపంచ శ్రేణి నగర ప్రణాళికలు ఆకృతుల రూపకల్పన సంస్థగా ఉన్న చైనాలోని షెన్‌జన్‌ ముఖ్యమైందన్నారు. 1948 నుండి షెన్‌జన్‌ నగరాభివృద్ధిలో ముందుకు వెళ్లిందని అంతకుముందు మత్స్యకారులతో నిండి ఉండి అభివృద్ధికి సుదూరంగా ఉందన్నారు. నేడు హాంకాంగ్‌ నగరానికి సోదర నగరంగా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సందర్భంగా చైనా బృందానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్థిక నగరాలను నిర్మించాటానికి షన్‌జెన్‌ తరహాలో నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నామన్నారు. ఇటీవల కేంద్ర ఆంధ్రాలో సముద్రతీరాన్ని పడమటిలో గుజరాత్‌ను ఉపాధి మండళ్లుగా గుర్తించిందన్నారు.