తిరుపతి విద్యార్థికి ఆపిల్ రూ.1.67 కోట్ల ఆఫర్

తిరుపతి విద్యార్థికి ఆపిల్ రూ.1.67 కోట్ల ఆఫర్

21-09-2018

తిరుపతి విద్యార్థికి ఆపిల్ రూ.1.67 కోట్ల ఆఫర్

తిరుపతికి చెందిన అనంత రవితేజకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఆపిల్‌ కంపెనీలో శాస్త్రవేత్తగా ఉన్నతోద్యోగం లభించింది. విద్యార్థి స్వస్థలం చంద్రగిరి మండలం పుల్లయ్యగారి పల్లి. తల్లిదండ్రులు నీలిమ, రమేష్‌ నాయుడు. ప్రాథమిక విద్య, ఇంటర్‌ తిరుపతిలో పూర్తి చేసి బెంగళూరులో ఈసీఈ విభాగంలో 2014లో బీటెక్‌ పట్టా పొందాడు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌లో కేవలం తొమ్మిది నెలల కాలంలో ఎంఎస్‌ పూర్తి చేశారు. ఎంఎస్‌ పూర్తికాగానే బ్లూం బర్గ్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతడి ప్రతిభను గుర్తించిన ఆపిల్‌ కంపెనీ ఏడాదికి రూ.1.67 కోట్ల పారితోషికంతో శాస్త్రవేత్తగా ఉద్యోగం కల్పించడానికి ముందుకొచ్చింది. దీంతో విద్యార్థి తన విధి నిర్వహణను ప్రారంభించారు.