ఏపీలోనూ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం

ఏపీలోనూ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం

20-09-2018

ఏపీలోనూ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం

తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సృష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గెలిచేవారికి మాత్రమే టికెట్లు ఇస్తామన్నారు. ఆ దిశగా కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్టకు మంత్రి పుల్లారావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు భూమి పూజ నిర్వహించారు. ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్న సీపీఎస్‌ రద్దు విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని జీవీ ఆంజనేయులు తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష పాత్రనూ తామే పోషించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు పేర్కొన్నారు.