22 నుంచి సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన

22 నుంచి సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన

20-09-2018

22 నుంచి సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారిక బృందం ఈ నెల 22 నుంచి 28 వరకు అమెరికాలో పర్యటించనుంది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి శాయిప్రసాద్‌, మరో ఆరుగురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, బ్లూంబర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం సంయుక్తంగా నిర్వహించనున్న సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ సదస్సు జరగనుంది.