రేపటితో శ్రీవారి బ్రహ్మూెత్సవాలు సమాప్తం

రేపటితో శ్రీవారి బ్రహ్మూెత్సవాలు సమాప్తం

20-09-2018

రేపటితో శ్రీవారి బ్రహ్మూెత్సవాలు సమాప్తం

తిరుమలేశుని వార్షిక బ్రహ్మూెత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు శుక్రవారం (ఈ నెల 21)తో పరిసమాప్తం కానున్నాయి. బుధవారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీమన్నారాయణుడు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. యోగముద్రలో బద్రీనారాయణుడి అవతారంలో భక్తకోటికి దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి చంద్రప్రభ వాహనం నుంచి శ్రీకృష్ణుడి అవతారంలో కనువిందు చేశారు. వేడుకల్లో గురువారం ఉదయం మహారథోత్సవం జరగనుంది. బ్రహ్మూెత్సవాల కారణంగా రద్దుచేసిన శ్రీవారి ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 22 నుంచి పునరుద్ధరించనుంది.