ఆ అదృష్టం నాకే దక్కింది : చంద్రబాబు

ఆ అదృష్టం నాకే దక్కింది : చంద్రబాబు

12-09-2018

ఆ అదృష్టం నాకే దక్కింది  : చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత రావడం తన అదృష్టమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం గ్యాలరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఐదుకోట్ల ప్రజల కలల జలసౌధం పోలవరమని అన్నారు. ఈ ప్రాజెక్టు దక్షిణాంధ్రకు నవజీవనం, నవ్యాంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని పేర్కొన్నారు. కేంద్ర సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. 2019లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గ్రావెటీ ద్వారా నీరిచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. పోలరవం కుడి కాల్వ 90 శాతం, ఎడమకాల్వ 63 శాతం పూర్తయింది.  పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టాలన్నీ రికార్డులు సృష్టించాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మితమవుతున్న ప్రాజెక్టుగా పోలవరం నిలవనుంది. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే ఏపీ ప్రభుత్వానికే అప్పగించాలని అప్పట్లో నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సిఫార్సు చేశారు. అందువల్లే ఈ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించింది. ఈ విషయంలో నాపై కొందరు విమర్శలు చేయడం బాధ కలిగించింది. పోలవరం  ప్రాజెక్టుకు అవరోధాలు కలిగించేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి అని అన్నారు.

Click here for Photogallery