మంత్రి లోకేష్ కు అరుదైన ఆహ్వానం

మంత్రి లోకేష్ కు అరుదైన ఆహ్వానం

12-09-2018

మంత్రి లోకేష్ కు అరుదైన ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు అరుదైన ఆహ్వానం అందింది. చైనాలో సెప్టెంబర్‌ 18 నుండి 20 వరకు జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం న్యూ ఛాంపియన్స్‌ వార్షిక సమావేశాలకు హాజరు కావాలని మంత్రి లోకేష్‌ను ఫోరం ప్రతినిధులు ఆహ్వానించారు. సమావేశాల్లో ప్రసంగించాల్సిందిగా కోరారు. ఈ ఆహ్వానం మేరకు మంత్రి లోకేష్‌ సెప్టెంబర్‌ 17 నుంచి 22 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా జరిగే 11 ఆర్థికపరమైన సమావేశాల్లో లోకేష్‌ ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ఈ ఐదురోజుల చైనా పర్యటనలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొనడంతో పాటు, పలు ఎలక్ట్రానిక్‌ కంపెనీల ప్రతినిధులను కలవనున్నారు. ఆయా తయారీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు.