రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు కేంద్రం కుట్ర

రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు కేంద్రం కుట్ర

11-09-2018

రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు కేంద్రం కుట్ర

తెలుగు రాష్ట్రాల మధ్య విభేధాలు సృష్టించాలని కేంద్రం చూస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ వ్యూహ కమిటి సభ్యులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అపోహలు పెంచాలని చూశారని మండిపడ్డారు. రాజకీయంగా టీడీపీని ఒంటరిని చేయాలని చూస్తున్నారన్నారు. అందుకే తెలంగాణలో ఏకపక్షంగా పొత్తులేదని బీజేపీ ప్రకటించిందని ఆరోపించారు. అటు ఏపీలో వైసీపీతో బీజేపీ అంటకాగుతోందని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని కోరినవాళ్లే గైర్హాజరయ్యారని, ఢిల్లీ వస్తానని చెప్పినవాళ్లు పత్తాలేకుండా పోయారని అన్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక చర్యల వల్లే ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిందని సృష్టం చేశారు. అందువల్లే కర్ణాటకలో బీజేపీయేతర పార్టీలకు తెలుగుదేశం మద్దతు ఇచ్చిందని తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మాత్రం బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసిందని ఆరోపించారు.