తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Sailaja Reddy Alluddu

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

11-09-2018

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే సాలకట్ల బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకొని ఆలయ శుద్ది కార్యక్రమం నిర్వహించారు. వేకువజామున సుప్రబాత సేవ అనంతరం మూలవిరట్‌ పట్టు పరదలతో పూర్తిగా కప్పేశారు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజ పాత్రలను అర్చకులు, ఆలయ సిబ్బంది శుభ్రపరిచారు. శుద్ధి తర్వాత నమపు కొమ్ము, శ్రీ చూర్ణం, పచ్చకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డలతో శాస్త్రోక్తంగా తయారు చేసిన సుగంథం వెదజల్లే పరిమళం అనే ద్రవాన్ని గోడలకు పైపూతగా పూసి అనంతరం శ్రీవారికి దూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కారణంగా అష్టదల పాదపద్మారాధాన సేవ రద్దు చేసింటి టీటీడీ.