ఈ నెల 13న తిరుమలకు సీఎం చంద్రబాబు

ఈ నెల 13న తిరుమలకు సీఎం చంద్రబాబు

11-09-2018

ఈ నెల 13న తిరుమలకు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13న తిరుమలకు రానున్నట్లు జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న తెలిపారు. 13న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 3:45 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. 4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5 గంటలకు తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహానికి వెళతారు. సాయంత్రం 6:45 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 7 గంటలకు శ్రీబేడి ఆంజనేయస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటారు. 7 గంటల నుంచి 8:30 గంటల మధ్య శ్రీవారి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. 14వ తేదీ ఉదయం 8:30 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 9:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 9:40 గంటలకు గన్నవరం బయలుదేరి వెళతారు.