బ్రహ్మూెత్సవాలకు అంకురార్పణ రేపే

బ్రహ్మూెత్సవాలకు అంకురార్పణ రేపే

11-09-2018

బ్రహ్మూెత్సవాలకు అంకురార్పణ రేపే

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలకు బుధవారం అంకురార్పణ జరుగనుంది. గురువారం ధ్వజారోహణతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పగలు, రాత్రి వివిధ వాహనాలపై విహరిస్తూ స్వామివారి భక్తకోటిని కటాక్షించనున్నారు. తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణతో ఉత్సవాలు పూర్తవుతాయి. బ్రహ్మూెత్సవాల అంకురార్పణలో భాగంగా ఆలయంలోనే బుధవారం సాయంత్రం 5-7 గంటల మధ్య శ్రీవారి సర్వనైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడిని సర్వాంగసుందరంగా అలంకరించి విశేష సమర్పణ చేస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాల కోసం టీటీడీ అటవీ అధికారులు దర్భను సమర్పించారు.